స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
SAI: న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా (SAI) లో 50 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నాలుగేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికల అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
టిటెక్/ రెండేళ్ల పిజి డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్/ ఎంబిబిఎస్ / ఎల్ ఎల్బి/ సిఎ/ ఐసిడబ్ల్యుఎ చేసి, ఏడాది అనుభవం ఉండాలి. లేదా ఏదైనా డిగ్రీ చదివి, స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ సర్టిఫికెట్ / డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లకు మించరాదు. ఎస్టి/ ఎస్సిలకు ఐదేళ్లు, ఒబిసిలకు మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ. 50వేలు గా ఉంది. ప్రాథమికంగా రూ. 50వేలు.. వ్యక్తి గత పనితీరు ఆధారంగా అధనంగా ఏడాదికి 7శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపికైనవారు సాయ్కు దేశవ్యాప్తంగా ఉన్న 23 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఎక్కడైనా నియమించవచ్చు. దరఖాస్తులను ఆన్లైన్లో పంపిచాలి. ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తులు పంపాలి. పూర్తి వివరాలకు https://sportsauthorityofinidia.nic.in/sai/ వెబ్సైట్ చూడగలరు.