ఎయిర్‌పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియాలో యంగ్ ప్రొఫెష‌నల్స్ ఖాళీలు

AAI: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ‌- ఎయిర్ పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా , న్యూఢిల్లీ లో యంగ్ ప్రొఫెష‌నల్స్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతుంది. లా విభాగంలో 2 యంగ్ ప్రొఫెష‌న‌ల్స్ ఖాళీల‌ను కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్నారు. బ్యాచిలర్ ఆఫ్ లా లేదా లా డిగ్రీ క‌నీసం 2 ఏళ్ల పోస్ట్ – క్వాలిఫికేష‌న్ అనుభ‌వం క‌లిగి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌స్సు జూన్ 16, 2025 నాటికి 32 ఏళ్ల కు మించ‌కూడ‌దు.   ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ.60వేలు అందుతుంది.

ద‌ర‌ఖాస్తుల‌ను నేటి నుండి 16 వ తేదీ వ‌ర‌కు స్వీక‌రిస్తారు. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ మెయిల్ ద్వారా chqrectt@aai.aero పంపించాల్సి ఉంది. ఇంట‌ర్వ్యూల‌ను వ‌చ్చే నెల 1 లేదా 2 వారం లో ఉండ‌వ‌చ్చు.

చిరునామా..కార్పొరేట్ ప్ర‌ధాన కార్యాల‌యం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా , రాజీవ్ గాందీ భ‌వ‌న్‌, స‌ఫ్ట‌ర్ జంగ్ విమానాశ్ర‌యం, న్యూఢిల్లీ.

Leave A Reply

Your email address will not be published.