రైల్వే పోలీస్‌గా చలామణి అవుతున్న యువతి అరెస్టు..
నల్గొండ (CLiC2NEWS): ఓ యువతి రైల్వే పోలీస్ (ఆర్పిఎఫ్) విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంభసభ్యులను, గ్రామస్థులను నమ్మించింది. పెళ్లి చూపుల్లో కూడా పోలీస్ యూనిఫామ్‌లోనే వెళ్లింది. పెళ్లి కొడుకు తరపు వాళ్లు ఆర్పిఎఫ్ పై అధికారులను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటన నార్కట్‌పల్లిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన మాళవిక ఆర్పిఎఫ్ ఎస్ ఐ పరీక్షకు హాజరైంది. కానీ కంటిచూపు సరిగాలేక అర్హత సాధించలేకపోయింది. ఎలాగైనా తల్లిదండ్రులు, గ్రామస్థులను దృష్ఠిలో పోలీస్‌గా చలామణి అవ్వాలని .. ఆర్పిఎఫ్గా విధులు నిర్వహిస్తున్నట్లు ఏడాదిగా అందరినీ నమ్మిస్తుంది. దేవాలయాలకు వెళ్లి, ప్రముఖులను కలిసి ఫోటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసేది. చివరకు పెళ్లి చూపుల్లో దొరికిపోయింది. నల్గొండ ఆర్పిఎఫ్ సిబ్బంది మాళవికను అదుపులోకి తీసుకున్నారు.