వైజాగ్ నేవి మారథాన్‌లో భారీ గా పాల్గొన్న యువత

విశాఖపట్నం (CLiC2NEWS): వైజాగ్ నగరంలో ఆదివారం నిర్వహించిన `నేవీ మారథాన్`లో యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మారథాన్ విశాఖ వాసుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆర్కే బీచ్‌లో ని పార్క్ చౌరస్తా ప్రాంతంలో నిర్వహించిన ఈ మారథాన్‌లో నేవీ అధికారులతో పాటు నగర పౌరులు భారీగా పాల్గొన్నారు. ఈ మారథాన్‌ను పార్క్ హోటల్ నుంచి భీమిలి వరకు ఈ రన్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ ఈవెంటల్‌లో 42.2 కి.మీ. ఫుల్ మారథాన్.
21.1 కి.మీ. హాప్ మారథాన్.
10 కే, 5 కే కీ. మీ. విభాగాల్లో ఈ మారథాన్ కొనసాగింది.