జగన్.. అప్పట్లో నాతోనే ప్రచారం చేయించారు .. వైఎస్ షర్మిల
అమరావతి (CLiC2NEWS): కాంగ్రెస్ పార్టీని తోక పార్టి అని వ్యాఖ్యలు చేయటం వైఎస్ ఆర్సిపి అవగాహన రాహిత్యమేనని ఎపిసిసి అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వాన్ని అడిగేతే వైఎస్ ఆర్సిపికి అసహనం ఎందుకని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టి పెట్టిన మీడియా సమావేశం వలనే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనంపై వివరణ ఇచ్చిందన్నారు. 2019 ఎన్నికల ముందు జగన్.. ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తానని చేప్పారని.. అప్పట్లో ఆమెతోనే ప్రచారం చేయించారన్నారు. ఒక్కొక్కరికి రూ. 15వేలు ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఎందుకు ప్రచారం చేయించారని .. సంపూర్ణ మద్యపాన నిషేధం, జలయజ్ఞం, ప్రత్యేక హోదా అంటూ ఎందుకు ప్రచారం చేయించారని షర్మిల ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు రావలని సవాల్ విసురుతున్నాని ఆమె ట్వీట్ చేశారు.