తమ పార్టి కార్యాలయాలు కూల్చేయబోతున్నారు.. వైఎస్ ఆర్‌సిపి

అమరావతి (CLiC2NEWS): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ పార్టి కార్యాలయాలను కూల్చివేయబోతున్నారని వైఎస్ ఆర్‌సిపి నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నుండి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. తాము ఇప్పుడే కూల్చివేయడం లేదని.. అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. దీంతో కేసు విచారణను ఉన్నతన్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది.