AP: ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను సస్పెండ్ చేసిన వైఎస్ఆర్సిపి

అమరావతి (CLiC2NEWS): చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులను వైఎస్ ఆర్‌సిపి ఆదివారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం నుండి ప్రకటన విడుదలైంది. ఇటీవల చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా విజయానందరెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో అసంతృప్తిగా ఉన్న శ్రీనివాసులు ఆదివారం జనసేనాని పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. వీరి సమావేశమైన కొన్ని గంటలలోపే శ్రీనివాసులను సస్పెండ్ చేసినట్లు ప్రకటన వెలువడింది.