వైఎస్సార్ సిపికి ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

విజయవాడ (CLiC2NEWS): అధికార వైఎస్సార్ సిపికి మరో షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఎంపి పదవితోపాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియా ముందు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… గత కొంత కాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపి శ్రీకృష్ణ దేవరాయలు ప్రకటించారు. పార్టీలో నెలకొన్న అనిశ్చితికి తాను బాధ్యుడిని కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా కొంత కాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని.. దానికి తెర దించేందుకు కే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కాగా ఇప్పటికే మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపి సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎంపి వైఎస్సార్సీపికి రాజీనామ చేయడం చర్చనీయాంశం అవుతోంది.