100వ రోజుకు చేరుకున్న యువగళం పాదయాత్ర..
పాదయాత్రలో నారా, నందమూరి కుటుంసభ్యులు..
శ్రీశైలం (CLiC2NEWS): యువనేత నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర నేడు 100వ రోజుకు చేరుకుంది. సోమవారం పాదయాత్రలో నారా,నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ పాదయాత్రను నారా లోకేశ్ శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేవుల క్యాంప్ సైట్ నుండి ప్రారంభించారు. లోకేశ్‌తో ఆయన తల్లి నారా భువనేశ్వరి, లోకేశ్వరి, హైమావతి, ఇందిర , నందమూరి జయశ్రీ, నందమూరి మణి, సిహెచ్ శ్రీమాన్, సిహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, పాటు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో టిడిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షెడె కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత రావుల చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు లోకేశ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయినట్లు సమాచారం.