టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ.సుబ్బారెడ్డి నియామకం..

తిరుమల (CLiC2NEWS): టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ జగన్ సర్కార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ బోర్డు సభ్యుల పదవీకాలం గత నెలలో ముగిసిన సంగతి తెలిసిందే.

ఆయన టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చైర్మన్‌గా పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డికే మరలా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం కూడా జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.