టి20 ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన జింబాబ్వే..

T20 : టి20 క్రికెట్‌లో జింబాబ్వే జట్టు ప్రపంచ రికార్డును సృష్టించింది. 20 ఓవర్లలో అత్యధికంగా 344 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. టి20 ప్రపంచకప్ సబ్ రిజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నిలో భాగంగా గాంబియాపై 344/4 స్కోర్ సాధించింది. కెప్టెన్ సికిందర్ రజా 133* పరుగులు చేశాడు. 43 బంతుల్లో 15 సిక్స్‌లు, 7 ఫోర్లు తీసి వీరవిహారం చేశాడు. ఇప్పటి వరకు టి20ల్లో అత్యధిక స్కోరు చేసిన రికార్డు నేపాల్ (314/3) పేరిట ఉంది .