కాలువలోకి దూసుకెళ్లిన కారు.. 6 గురు మృతి

శ్రీనగర్‌: అదుపుతప్పి కారు కాలువలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ ఘ‌ట‌న సోమవారం జమ్ముకశ్మీర్‌ దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. దోడా నుంచి బటోట్‌ వెళ్తున్న కారు అదుపుత‌ప్పి జారి రిజి కాలువలోకి దూసుకెళ్లిందని దోడా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారని, కారును కాలువ నుంచి వెలికితీసినట్లు పోలీసులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.