కూతురు ఎంగేజ్మెంట్లో కనిపించని పవన్
కూతురు ఎంగేజ్మెంట్లో కనిపించని పవన్
కూతురు ఎంగేజ్మెంట్లో కనిపించని పవన్
నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్థం గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా హీరోలైన రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ అందరూ హాజరయ్యారు. కానీ నిహారిక బాబాయ్ జాడ మాత్రం కనిపించలేదు. నాగబాబు తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంగేజ్మెంట్కు రాకపోవడంతో సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు బయలు దేరాయి. నితిన్ పెళ్లి వేడుకకు వెళ్లేంత సమయం ఉన్న పవన్‌కు సొంత అన్న కూతురి నిశ్చితార్థానికి ఎందుకు వెళ్లలేదంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కానీ నిజానికి పవన్ చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. గత నెల ఈ దీక్షకు పూనుకున్నారు. ఇది నాలుగు నెలలపాటు కొనసాగుతుంది. ఈ దీక్షలో ఉన్నప్పుడు సాయంత్రం ఆరు తర్వాత ఇల్లు విడిచి వెళ్లకూడదు. ఎంగేజ్మెంట్ రాత్రి పూటే జరగడంతో ఆ వేడుకలో పవన్ కనిపించలేదు. అయితే గురువారం ఉదయమే వెళ్లి నిహారికను, ఆమెకు కాబోయే భర్త చైతన్యను మనసారా ఆశీర్వదించారు.