కేరళలో మరో మహమ్మారి.. షిగెల్లాతో ఒకరు మృతి!
తిరువనంతపురం: ఇప్పటికే దేశం మొత్తం కరోనా మహమ్మారి మూలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ, కేరళలో సెకండ్ వేవ్ కూడా కొనసాగుతోంది. అయితే సమయంలో షిగెల్లా అనే మరో మహమ్మారి కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే ఒకరు మృతి చెందగా, 20 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి నీరు, ఆహరం ద్వారా ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నది. జ్వరం, అతిసారం, కడుపులో తిప్పడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. మరణించిన చిన్నారికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు కూడా ఈ షిగెల్లా సోకడంతో కేరళ ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. షిగెల్లా వ్యాధి సోకిన పరిసరాల్లోని నీటిని పరిశీలిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కేరళ ఆరోగ్యశాఖ సూచనలు చేసింది.