గంగా నదిలో పడవ మునక.. 100 మంది గల్లంతు

పాట్నా: బీహార్‌లోని భగల్‌పూర్ జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. 100 మంది రైతులు, కూలీలతో వెళ్తున్న ఓ పడవ గురువారం ఒక్కసారిగా గంగా నదిలో మునిగిపోయింది. టింటంగా దియార వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సామర్థ్యానికి మించి పడవలో కూలీలను, రైతులను ఎక్కించడమే కాకుండా.. సైకిళ్లు, బైక్‌లతో నదిని దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 15 మంది దాకా ఈత కొడుతూ ఒడ్డుకు చేరారు. బాధిత కుటుంబాల సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు అక్కడికి భారీగా తరలి వచ్చారు. పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది భారీగా గాలింపు చర్యలు జరుపుతున్నారు.
Bihar: Several people missing after a boat capsized in Naugachhia area of Bhagalpur earlier today. There were over 100 people on board the boat, rescue and search operation underway. pic.twitter.com/2pre5AtBwW
— ANI (@ANI) November 5, 2020