చెట్టును ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం

పితోర్‌ఘర్‌: యుపిలోని పితోర్‌ఘర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో కానిస్టేబుల్‌తో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. కధారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పట్టి రోడ్డులో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. మృతులను సందీప్‌ యాదవ్‌ (26), అఖిలేశ్‌ యాదవ్‌ (35), రాహుల్‌ యాదవ్‌ (28), పప్పు యాదవ్‌, సందీప్‌ కుమార్‌ యాదవ్ ‌(29)గా పోలీసులు గుర్తించారు. వీరంతా సమీపంలోని ఓ గ్రామంలో బంధువు వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా దేవాన్‌ మౌ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు ఎస్పీ సురేంద్ర పీ ద్వివేది తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.