జనవరి 31 వరకూ ఉల్లి దిగుమతిపై ఆంక్షలు సడలింపు

న్యూఢిల్లీ: ఉల్లి దిగుమతులపై ఆంక్షల సడలింపును 2021 జనవరి 31 వరకూ పొడిగిస్తూ గురువారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉల్లి సరఫరా పెరగడానికి, ఉల్లి ధరలు దిగిరాడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంతకు ముందు అక్టోబర్‌ 21న డిసెంబరు 15 వరకూ ఉల్లి దిగుమతులపై ఆంక్షలను సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని జనవరి 31 వరకూ పొడిగిస్తూ గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొన్ని షరతులతో ఉల్లి దిగుమతులపై ఆంక్షల సడలింపు వర్తిస్తుందని తెలిపింది. అలాగే దిగుమతి సరకును అధికారులు తనిఖీ చేస్తారని, పురుగులు, తెగుళ్లు లేకపోతేనే భారత్‌లోకి అనుమతిస్తారని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.