దుబ్బాక ఓటమికి జీహెచ్‌ఎంసీలో రివేంజ్‌!

ఫలించిన మంత్రి హరీశ్‌రావు వ్యూహం.. 3 డివిజన్లలోనూ విజయం..

హైద‌రాబాద్‌: `గ్రేటర్‌` ఎన్నికల్లో బాధ్య‌త‌లు అప్ప‌గించిన 3 డివిజ‌న్ల‌లోనూ పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకత నిలుపుకొన్నారు. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ చాలా సిట్టింగ్‌ డివిజన్లను కోల్పోయింది., కానీ హరీశ్ రావు పర్యవేక్షించిన పటాన్‌చెరు నియోజకవర్గంలో మాత్రం అన్నిట్లోనూ విజయం సాధించడం విశేషం. తద్వారా, దుబ్బాక ఉప ఎన్నిక చేదు అనుభవాన్ని హరీశ్‌ అధిగమించగలిగారు.

2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్లను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. పటాన్‌చెరు డివిజన్‌ కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లింది. ఈసారి మాత్రం మూడింటినీ చేజిక్కించుకోవాలని హరీశ్‌ పకడ్బందీ వ్యూహం రచించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌కు పార్టీ తరఫున ఒకరిని బాధ్యుడిగా నియమించారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు డివిజన్‌ బాధ్యతలు అప్పగించారు. పటాన్‌చెరును మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రామచంద్రాపురం, భారతీనగర్‌లను అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ పర్యవేక్షించారు. కాంత్రికిరణ్‌కు రామచంద్రాపురం ప్రాంతంతో అనుబంధం ఉండటం గమనార్హం. ప్రచారం మొదలైనప్పటి నుంచి ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించడమే కాకుండా వివిధ సంఘాల ప్రతినిధులు, ముఖ్య సభ్యులను పిలిచి మాట్లాడారు. కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ హరీశ్‌ సమావేశమై తమ వైపు తిప్పుకొనేలా చేశారు. ప్రచారం చివరి రోజున మంత్రి నిర్వహించిన బహిరంగ సభలు కూడా వియవంతమయ్యాయి.

`గ్రేట‌ర్‌` కౌంటింగ్‌.. ‌మినిట్ టూ మినిట్

Leave A Reply

Your email address will not be published.