దేశంలో కొత్తగా 26 వేల కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా దేశంలో కొత్తగా 26,624 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటీ 31,223కు చేరింది. ఇందులో 95,80,402 మంది కోలుకోగా, 3,05,344 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,45,477 మంది బాధితులు కరోనాతో మరణించారు. ఇక గత 24 గంటల్లో మహమ్మారి బారినపడినవారిలో 341 మంది మృతిచెందగా, మరో 26,690 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం యాక్టివ్ కేసుల్లో కేరళ, మహారాష్ట్రలోనే 40 శాతం ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా నిన్న ఒకేరోజు 11,07,681 మందకి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో డిసెంబర్ 19 నాటికి మొత్తం 16,11,98,195 నమూనాలకు కరోనా పరీక్షలు చేశామని తెలిపింది.