నాజూకు దేహం కోసం యోగాసనాలు

యోగాసనాలు వేయడం వలన నిద్రాణమై వున్న జీవ శక్తి చైతన్యవంతమవుతుంది. ఈ ఆసనాలు కండరాల్లో కదలికను పెంచి నూతన కణజాలం తయరీకి దోహద పడుతుంది. యోగమనేది జీవన వైఖరి కావాలి. తేలికైన ఆసనాలు నరాలను ఉతేజపరచి రక్త ప్రసారంపై తోడ్పడి శరీరంలో బలాన్ని పెంచుతాయి. యోగాసనాల వలన శరీరంలో సంకోచ వ్యాకోచాలు కలిగి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
యోగాసనాలతో పాటుగా ప్రాణాయమాన్ని కూడా సరియైన పద్ధతి లో ఆచరిస్తే జీర్ణకోశ సమస్యల్ని తగ్గించి ఎన్నో వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ప్రాణా యామాన్ని గురుముఖత నేర్చుకుని ప్రతి రోజు చేస్తుంటే ఊపిరి తిత్తులలోనికిశాతం ఎక్కువగా చేరి , గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. యోగాసనాలు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయి. అందరూ యోగా వైపు ద్రుష్టి మళ్లించాలి.
(తప్పక చదవండి: తైలాభ్యంగనము)
వ్యాయామం..
యోగాసనాలు , ప్రాణాయామం గురుముఖత నేర్చుకుని చేస్తే మంచిదే . అలా కుదరని వారు తేలికైన నడకతో ప్రారంభించి ప్రతి రోజు 20 నిమిషాల నుంచి ఒక గంట వరకు ఒంటికి చమట పట్టునట్లు వారి వారి ఆరోగ్య స్థితులను బట్టి ప్రతి రోజు వాకింగ్ చేయాలి. ఇది కూడా మంచి వ్యాయామమే ఉదయం సూర్య కిరణాలు శరీరం పై పడితే చాలా మంచిది. విరమిన్ డి ప్రకృతి ద్వారా లభిస్తుంది. చర్మం కాంతి వంతమవుతుంది.
సోమరి తనం బద్ధకం తగ్గి శారీరక శక్తి పెరుగుతుంది. శరీరానికి మంచి ఆకృతి కలుగుతుంది. శరీరానికి వాతావరణ పరిస్థితుల మార్పును తట్టుకునే శక్తి పెరుగుతుంది. వ్యాయామం చేసే వారికీ ఆకలి పెరిగి ఆరోగ్యం బాగు పడుతుంది. వ్యాయామం చేసే వారికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వృద్ధాప్యము దరి చేరదు.
-పి.కమలాకర్ రావు