‘ఫిదా’ నటుడి నిశ్చితార్థం
‘ఫిదా’ నటుడి నిశ్చితార్థం
టాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ కరోనా లాక్డౌన్లో.. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోగా…హీరోలు రానా, నితిన్, నిఖిల్ తదితరులు వివాహ బంధంతో కొత్త జీవితాలు మొదలుపెట్టారు. ఇటీవల నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం జరిగింది. తాజాగా ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా చెంబోలుకు వివాహ నిశ్చితార్థం జరిగింది. “ఫిదా” సినిమాలో వరుణ్ తేజ్‌కు అన్నయ్యకు నటించిన రాజా తన ఎంగేజ్మెంట్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఫొటోలను షేర్ చేస్తూ “ఇది 2020లోనే బెస్ట్ పార్ట్. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు” అని ట్వీట్ చేశారు.
‘ఫిదా’ చిత్రంలో తన అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు రాజా చెంబోలు. ఆ చిత్రంలో వరుణ్ తేజ్‌కు అన్నయ్యగా నటించాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్, అంతరిక్షం, మిస్టర్ మజ్ను, రణరంగం తదితర పలు చిత్రాల్లో రాజా చెంబోలు నటించారు. ‘ఫిదా’ చిత్రంలో తన అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు రాజా చెంబోలు. ఆ చిత్రంలో వరుణ్ తేజ్‌కు అన్నయ్యగా నటించాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్, అంతరిక్షం, మిస్టర్ మజ్ను, రణరంగం తదితర పలు చిత్రాల్లో రాజా చెంబోలు నటించారు.