ఫేస్‌బుక్‌లో షార్ట్ వీడియోలు
ఫేస్‌బుక్‌లో షార్ట్ వీడియోలు
టిక్‌టాక్ తరహాలోనే
న్యూఢిల్లీ: సెలబ్రిటిల నుండి సామాన్యుల వరకు టిక్‌టాక్ ప్రేమికులే.. ఆ స్థాయిలో టిక్‌టాక్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇలాంటి సందర్భంలో టిక్‌టాక్‌ను నిషేధించడంతో అలాంటి యాప్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి యాప్‌లను తీసుకురావడానిక చాలా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు యాప్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తే. మరికొన్ని సంస్థలు కొత్త యాప్‌లను రూపొంస్తున్నాయి.. మరికొన్ని సంస్థలు ఉన్న యాప్‌లనే కొత్త ఫీచర్లతో అందిస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ కూడా ఇదే ఆలోచన చేస్తోంది. కొత్త యప్ తీసుకురాకుండా.. ఉన్న యాప్‌లోనే షార్ట్ వీడియో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫేస్‌బుక్‌లో ఇప్పటికే ఈ ఫీచర్ కొంతమందికి ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. న్యూస్‌ఫీడ్ మధ్యలో బ్లాక్స్‌లా షార్ట్ వీడియోస్ కనిపిస్తాయి. దీని ద్వారా యూజర్స్ తక్కువ నిడివి గల వీడియోలను రూపొందించవచ్చు. వీక్షించవచ్చు. ఇప్పటికే భారత్ మార్కెట్లో రోపోసో. మోజ్, జోష్, ఎంఎక్స్ టకాటక్, చింగారీ, ట్రెల్లో, మిత్రోన్, రీల్స్, హాట్‌షాట్స్ వంటి షార్ట్ వీడియోల యాప్‌ల డౌన్‌లోడ్‌లు పెరిగాయి. మరికొన్ని సంస్థలు ఇలాంటి యాప్స్ తీసుకురావాలని చూస్తున్నాయి. ఏదిఏమైనా ఫేస్‌బుక్‌లో టిక్‌టాక్ తరహా వీడియోలు వస్తే షార్ట్ వీడియో అభిమానులకు పండగే మరి.