బీహార్ లో మోడీ ఎన్నికల ప్రచారం

పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ససారాంలో జరిగిన ఎన్డీఎ ఉమ్మడి ప్రచార ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘నితీశ్ సర్కార్ త్వరగా స్పందిచకపోతే… మహమ్మారి చాలా మందిని పొట్టనబెట్టుకునేది. ఊహించడానికే వీలుండేది కాదు. అల్లకల్లోలంగా ఉండేది. కరోనాతో పోరాడాం. ఈ రోజు బిహార్‌లో ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నాం.’’ అని మోదీ తెలిపారు. ఎన్డీయే కూటమి కచ్చితంగా బీహార్ లో విజయం సాధిస్తుందని అన్నారు. ఈ ర్యాలీలో ప్రధానితో పాటు, నితిష్ కుమార్ పాల్గొన్నారు. గయా, భాగల్పూర్ లలో ఈరోజు జరిగే మరో రెండె ర్యాలీలలో కూడా ఆయన పాల్గొంటారు. కాగా, అన్ని పార్టీలు తమ మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే… రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత కోవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తామని వాగ్దానం చేసింది.
(తప్పకచదవండి: బీహార్‌కు మాత్రమే ఉచిత వ్యాక్సినా?)
గతంలో పేదల కోసం ఉద్దేశించిన డబ్బుతో అవినీతి పనులు చేశారని, కానీ తాము మాత్రం ఆ డబ్బుతో కరోనా సమయంలో పేద కుటుంబాలకు ఉచిత ఆహారాన్ని అందించామని ఆయన గుర్తు చేశారు.దేశ రక్షణకు, భద్రతకు సంబంధించిన విషయంలో బిహార్ ప్రజలెప్పుడూ ముందుంటారని, గాల్వాన్ ఘర్షణను ఉదహరిస్తూ ఆయన పేర్కొన్నారు. ‘‘గాల్వాన్ సరిహద్దుల్లో తలెత్తిన ఘర్షణలో బిహార్‌కు చెందిన జవాన్లు దేశం కోసం అమరులయ్యారు. పుల్వామాలో కూడా. దేశం కోసం బిహార్ పౌరులు తమ ప్రాణాలనే ఇచ్చారు. వారికి నమస్కారం.’’ అని మోదీ వ్యాఖ్యానించారు.