భారత్ లో మరో 5 కొత్త స్ట్రెయిన్ కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. దీనికి తోడు ఇప్పడు మళ్లీ కొత్తగా కొత్త స్ట్రెయిన్ భయం పట్టుకుంది. ఇంగ్లాండ్ లో కొత్త స్ట్రెయిన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశంతో విమాన సర్వీసులను తెగతెంపులు చేసుకుంది ఇండియా. ఇండియాలో ఇప్పటి వరకు 20 కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈరోజు మరో ఐదు కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం నమోదైన కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య 25కి చేరింది. ఇందులో పూణే వైరాలజీ ల్యాబ్ లో నాలుగు, ఢిల్లీ ఐజీఐబి ల్యాబ్ లో ఒక కేసును నిర్ధారించారు. అయితే, నిర్ధారణ జరిగిన కేసులు ఏ రాష్ట్రానికి చెందిన కేసులు అన్నది తెలియాల్సి ఉన్నది. మంగళవారం రోజున ఆరు కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదు కాగా, బుధవారం రోజున 14 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మరో ఐదు కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.