భారత్‌లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: భారత్‌లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది. భారత్‌లో అనుమతి పొందిన తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్‌గా నిలిచింది. ఇండియాలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కొవిషీల్డ్ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించిన కమిటీ. ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)కి పంపించింది. దీనిపై తుది నిర్ణయం డీజీసీఐ తీసుకోనుంది.