మహారాష్ట్రలో కొత్తగా 3,717 కరోనా కేసులు.. 70 మరణాలు

ముంబయి: దేశ ఆర్ధిక రాజధాని మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు ప్రతి రోజు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,717 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,80,416కు, మరణాల సంఖ్య 48,209కు పెరిగింది. ఈమేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు గత 24 గంటల్లో 3,083 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 17,57,005కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 74,104 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.