యుపిలో రోడ్డు ప్రమాదం ..ఏడుగురు మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిలిభిత్‌ జిల్లాలోని పూరాణ్‌పూర్‌ వద్ద శనివారం ఉదయం బస్సు, కారును ఢ కొన్న ఘటనలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో 32మందికి తీవ్రంగా గాయపడ్డారని పోలీస్‌ సూపరింటెండెంట్‌ జై ప్రకాష్‌ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.