రెండు కార్లను ఢీకొట్టిన లారీ.. ముగ్గురికి తీవ్రగాయాలు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట పరిధిలోని ఔటర్ రింగ్‌రోడ్డు పై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చి న లారీ అదుపుతప్పి రెండు కార్లను ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన వేగానికి ఓ కారు రోడ్డువెంట ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రమాద ధాటికి కార్లు ధ్వంసం కాగా రెండు కార్లలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.