వకీల్ సాబ్: సెన్సార్ పూర్తి..

మూడేళ్ల‌త‌ర్వాత ప‌వర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `వకీల్ సాబ్`తో వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. బోణికపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్లను పెంచేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘వకీల్ సాబ్’ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, నివేదా థామస్, అనన్య, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.