ఎపిలో కొత్తగా 1,326 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఎపి వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,09,002 కు చేరింది. వీటిలో ఇప్పటి వరకు 8,91,048 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,710 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఐదుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,244 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 911 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు.