శౌర్యచక్ర విజేత బల్విందర్ సింగ్ కాల్చివేత..

తర్న్ తారన్: ఉగ్రవాదుల సింహస్వప్నం, శౌర్యచక్ర అవార్డు గెలిచిన బల్విందర్ సింగ్ భిక్విండ్‌ను శుక్రవారం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. బల్విందర్ వయసు 63 ఏళ్లు. ఈ ఘటన పంజాబ్‌లోని తర్న్ తారన్‌లో జరిగింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పంజాబ్‌లో.. బల్విందర్ సింగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అయితే ఇవాళ ఉదయం ఆయన్ను ఇంటి వద్దే హత్య చేశారు. ఉగ్రవాదులే బల్విందర్‌ను కాల్చి చంపి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 2017లో కూడా బల్విందర్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు ఇంకా స్పందించలేదు.