స్టాప్ ది కౌంట్: ట్రంప్ ట్వీట్
రేసులో ముందున్న బిడెన్..

వాషింగ్టన్: గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తిగా మారాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు. ప్రస్తుతం ఫలితాల ట్రెండ్‌ను చూస్తుంటే.. విజయం దాదాపుగా డెమొక్రట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్నే వరించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం జో బిడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో రేసులో ముందుండగా, ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. బిడెన్ రేసులో ముందున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ‘స్టాప్ ది కౌంట్’ అని ట్రంప్ తాజాగా ట్వీట్ చేశారు.
(అమెరికా ఎన్నికల్లో ఏం జరుగుతుందో 2 వారాల ముందే చెప్పిన బెర్నీ)
STOP THE COUNT!
— Donald J. Trump (@realDonaldTrump) November 5, 2020