హైదరాబాద్ వస్తున్న బస్సు బోల్తా!
40 మందికి గాయాలు.. 20 మంది పరిస్థితి విషమం

కటక్: ఒడిశాలోని కలహండి జిల్లా ధర్మాఘర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కోక్సొర పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొడికెందుగుడ సమీపంలో ఈ ప్రమాదం జిరిగింది. ఈ బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 40 మందికి గాయాలయ్యాయి. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.