అనుష్క శీర్షాస‌నం.. సాయం చేసిన కోహ్లి

ముంబ‌యి: యోగా తన జీవితంలో భాగమని, గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ఆసనాలు వేయడం సంతోషంగా ఉందన్నారు బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ. అయితే వైద్యుల సూచనలు, సలహాలు పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి- అనుష్క దంపతులు త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమ్మదనాన్ని ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు తన ఫొటోలతో పాటు ఆరోగ్య వివరాలు, గర్భవతిగా ఉన్న సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అనుష్క సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు.

శీర్షాస‌నం వేయ‌డంలో విరాట్ ఆమెకు సాయం చేయ‌డం ఈ ఫొటోలో క‌నిపిస్తుంది. త‌ల కిందికి, కాళ్లు పైకి పెట్టి చేసే ఈ ఆస‌నం చాలా క్లిష్ట‌మైన‌ద‌ని అనుష్క‌ కామెంట్ చేసింది. అయితే యోగా త‌న జీవితంలో ఓ భాగ‌మైపోయింద‌ని, అందుకే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు గ‌ర్భవ‌తిగా ఉంటూ కూడా ప‌లు ఆస‌నాల‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పింది. త‌న యోగా టీచ‌ర్ ఈఫా ష్రాఫ్‌తోపాటు త‌న భ‌ర్త విరాట్ కోహ్లి తాను ఈ శీర్షాస‌నం వేయ‌డానికి సాయం చేశార‌ని అనుష్క ఆ పోస్ట్‌లో కామెంట్ చేసింది. యోగా టీచ‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌, స‌రైన గైడెన్స్‌తో తాను యోగా కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పింది.

 

 

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

Leave A Reply

Your email address will not be published.