ఆటో-లారీ ఢీ.. ఆరుగురు మృతి
నూజివీడు: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా నూజివీడు మండలం లయన్‌తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. గాయపడ్డవారిని విజయవాడ, నూజివీడు దవఖానాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.