జూన్ 28 నుంచి అమర్నాథ్ యాత్ర

న్యూఢిల్లీ: అమరనాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు కేంద్ర స‌ర్కార్ శుభ‌వార్త చిప్పింది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు కేంద్రం అనుమతులు మంజూరు చేస్తూ సంబంధిత షెడ్యూల్ ను అమరనాథ్ ఆలయ ట్రస్ట్ రిలీజ్ చేసింది. జూన్ 28 నుంచి ఆగష్టు 22 వరకు అమర్నాథ్ యాత్ర ఉంటుందని ప్రకటించింది. కోవిడ్ నిబంధనలతో అమరనాథుడి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది.  ఏప్రిల్ 1 నుంచి అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ఉంటాయి.

Leave A Reply

Your email address will not be published.