ఇరాన్‌లో 10 మంది పర్వాతారోహకులు మృతి

దుబాయ్ : ఇరాన్‌ రాజధాని తెహ్రాన్‌కు ఉత్తరాన ఉన్న పర్వతాలలో సుమారు 10 మంది పర్వాతారోహకులు మృతి చెందారు. భారీ హిమపాతం కారణంగా వీరు మరణించారని స్థానిక మీడియాలో వార్తలొస్తున్నాయి. అదేవిధంగా గల్ఫ్‌లో తుపానుల కారణంగా ఓ నౌకలో బోల్తా పడిన ఘటనలో ఇరాన్‌కు చెందిన ఏడుగురు సిబ్బంది ఆచూకీ కూడా కానరావడం లేదు. గత కొన్ని రోజులుగా ఇరాన్‌లోని పలు ప్రాంతాలు భారీ హిమపాతంతో తడిసి ముద్దవుతున్నాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అనేక రహదారులను మూసివేశారు. తెహ్రాన్‌లోని ఆల్‌బోర్జ్‌ పర్వతాన్ని ఎక్కేందుకు వచ్చిన తొమ్మిది మంది భారీ హిమపాతంలో చిక్కుకుపోయి చనిపోగా..మరొకరిని రక్షించినప్పటికీ..చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.