ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా

టి.వేదాంత సూరి: తెగ‌ని జ్ఞాప‌కాలు

సుమారు నాలుగు దశాబ్దాల క్రితం 1978-79 సంవత్సరం లో ఉస్మానియా యూనివర్సిటీ లో అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్ మెంట్ లో పి. జి డిప్లొమా చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి.. ఈ రోజు గాంధీ, శాస్త్రి జయంతి కాబట్టి రాయాలని.. అనిపించింది. ఆరోజుల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు ముతాలిబ్ గారు అధిపతి. మాకు అక్బర్ అలీ ఖాన్, మదన్, సత్యనారాయణ, రాఘవయ్య గార్లు టీచర్స్. అంధులో ఆరుగురు ప్రెస్‌, ఎనమండుగురు మున్సిపల్ కమిషనర్ లు.. నేను, గంగారాం, చంద్రశేఖర్ రెడ్డి, నరసింహ రెడ్డి, కవిత (మహబూబాబాద్ మాజీ ఎం ఎల్ ఏ . జనార్దన్ రెడ్డి గారి కూతురు) భారతి (మయూరి ఎడిటర్ భీం రెడ్డి గారు సోదరి) వుండే వాళ్ళం కమిషనర్లు రామసుబ్బారెడ్డి, రామ్మోహన్ రావు, జయరాం జెట్టి. గిడ్డయ్య, గన్ని.. మరో నలుగురు ఉండేవారు. ఇందులో భాగంగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఫీల్డ్ స్టడీ ఉండేది. ఒక్కో చోట పది రోజులు ఉండాలి.

(త‌ప్ప‌క చ‌ద‌వండి: టి. వేదాంత సూరి : పివి, బాలు ఇద్ద‌రూ ఇద్ద‌రే!)

 

ఈ నేపథ్యంలో మేము 1997 డిసెంబర్ లో ఢిల్లీ వెళ్ళాం.. అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హాస్టల్ లో వున్నా.. విపరీతమైన చలి.. ఒక వైపు ఢిల్లీ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో పని.. తీరిక వేళల్లో ఇష్టమైన ప్రదేశాలు చూడటం, తాజ్ మహల్, మధుర, ఫతేపూర్ సిక్రి, కుతుబ్ మినార్, ఇండియా గేట్ అవి చూసాం.. అదే సందర్భం లో రాజ్ ఘాట్ (గాంధీ సమాధి) విజయఘాట్ (లాల్ బహదూర్ శాస్త్రి సమాధి) చూసాం.. అక్కడి నుంచి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటికి వెళ్ళాం, మమ్మల్ని అనిల్ శాస్త్రి (లాల్ బహదూర్ కుమారుడు) సాదరంగా ఆహ్వానించారు. లలితా శాస్త్రి ని పలుకరించి కబురులు చెప్పాం, అప్పుడు ఆమె సాధారణంగా ఆకుకూరలు తరుగుతూ కిందనే కూర్చుంది.. ఆమె పక్కనే అందరం కూర్చుని ఫోటో తీసుకున్నాం. రామ్ దూలారి దేవిని (లాల్ బహదూర్ తల్లి ) కూడా చూసిన జ్ఞాపకం . అప్పుడు నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా వుండే వారు వారి అనుమతితో రాష్ట్రపతి భవన్ వెళ్ళాం.. ఢిల్లీలో చాందిని చౌక్, జుమ్మా మజీద్, గురుద్వారా, వంటివి చూసాం.. తరువాత హైదరాబాద్ చేరుకున్నాం.. గాంధీ, శాస్త్రి జయంతి అనగానే.. ఈ జ్ఞాపకాల్ని నాలో సందడి చేశాయి. వారికి అక్షర రూపం ఇచ్చే ప్రయత్నమే ఇది. నేను తీసుకున్న ఫోటోలు నావద్ద లేవు. మిత్రులు కూడా ఎక్కడెక్కడ వున్నారో తెలియదు.. గంగారాం మాత్రం ఎక్కడున్నా పలకరిస్తూనే వుంటారు.. వారి పిల్లలతో నాకు, నా పిల్లలతో ఆయనకు మంచి పరిచయం వుంది.

Leave A Reply

Your email address will not be published.