ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. మృతులను డార్రేకాసా, మలాజ్‌ఖండ్ దళాల సభ్యులు సావిత్రి, శోభగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన ఇద్దరు మోస్టువాటెంట్ మావోయిస్టులని నక్సల్ ఆపరేషన్ అదనపు డీజీ జీపీ సింగ్ తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దులోని బొరేవాన్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.