ఒకే రోజు మూడు న‌గ‌రాల్లో రేపు మోడీ ప‌ర్య‌ట‌న‌!

టీకా కేంద్రాలను ప‌రిశీలించ‌నున్న ప్ర‌ధాని!

హైద‌రాబాద్‌:  దేశంలో ఉత్ప‌త్తి అవున్న క‌రోనా వ్యాక్సిన్ త‌యారీ కేంద్రాల‌ను ప‌రిశీలించేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సిద్ధ‌మ‌య్యారు. దేశంలోని మూడు ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ అహ్మ‌దాబాద్‌, హైద‌రాబాద్‌, పుణె న‌గ‌రాల్లో శ‌నివారం ప్ర‌ధాని ప‌ర్య‌టిస్తారు. అహ్మ‌దాబాద్‌లోని జైడ‌స్ బ‌యోటెక్ పార్క్‌, హైద‌రాబాద్‌లోని భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌ను, పుణెలోని సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్ర‌ధాని మోదీ విజిట్ చేస్తార‌ని పీఎంవో కార్యాల‌యం త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. కోవిడ్‌పై పోరాటంలో భార‌త్ కీల‌క ద‌శ‌కు చేరుకున్న‌ద‌ని, టీకా ఉత్ప‌త్తి చేస్తున్న కేంద్రాల‌ను విజిట్ చేయ‌డం, అక్క‌డ ఉన్న శాస్త్ర‌వేత్త‌ల‌తో సంప్ర‌దించ‌డం వ‌ల్ల .. టీకా గురించి స‌మ‌గ్ర స‌మ‌చారం తెలుస్తుంద‌ని పీఎంవో త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది. దేశ పౌరుల‌కు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను, కార్యాచ‌ర‌ణ‌ను త‌యారు చేసేందుకు ఈ ప‌ర్య‌ట‌న వీల‌వుతుంద‌ని పీఎంవో త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.