కత్తి మహేష్ అరెస్టు
కత్తి మహేష్ అరెస్టు
కత్తి మహేష్ అరెస్టు

హైదరాబాద్: నటుడు కత్తి మహేశ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువులు ఆరాధించే శ్రీరాముడిపై ఫేస్ బుక్‌లో అసభ్య కామెంట్లను పోస్ట్ చేశారంటూ గతంలో కత్తి మహేశ్ పై హిందూ సంస్థలతో పాటు పలువురు వ్యక్తులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారి ఫిర్యాదులు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 153 ఎ కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు పలు విచారణల అనంతరం శుక్రవారం కత్తి మహేశ్‌ను అరెస్ట్ చేశారు. ఉస్మానియా హాస్పిటల్లో పరీక్షల అనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. మహేశ్ పై 201 నుంచి సైబర్ క్రైమ్ స్టేషన్ లో దాదాపు 5 కేసులు నమోదయ్యాయి.