కేంద్ర మంత్రి హ‌ర్దీప్‌సింగ్‌పురితో సీఎం కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ :  తెలంగాణ సిఎం కె. చంద్ర‌శేఖ‌ర‌రావు ఢిల్లీలో రెండో రోజు (శ‌నివారం) ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్‌పురితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ర్టంలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి నిధుల విడుద‌ల‌పై కేంద్ర‌మంత్రితో కేసీఆర్ చ‌ర్చిస్తున్నారు. గృహ నిర్మాణం, పౌర విమానయాన రంగాలకు సంబంధించిన ప్రాజెక్ట్‌లపై చర్చించారు. పట్టణాభివృద్ధికి నిధులు, వరంగల్‌, సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.

రాష్ట్రంలో చాలారోజులుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ సంబంధిత శాఖల మంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రధాని మోదీతోపాటు పలువురు మంత్రులను కలిసే అవకాశం ఉన్నది. విభజన హామీలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రధానితో చర్చించనున్నారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలువనున్నారు. జాతీయ రహదారులకు నిధుల మంజూరుపై గడ్కరీతో చర్చించే అవకాశం ఉన్నది. నిన్న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. నీటి ప్రాజెక్టులు, నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

1. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ (బ్రౌన్ ఫీల్డ్)

2. మామునూర్ (వరంగల్) బ్రౌన్ ఫీల్డ్

3. ఆదిలాబాద్ (గ్రీన్ ఫీల్డ్)

4. జక్రాన్ పల్లి, నిజామాబాద్ (గ్రీన్ ఫీల్డ్)

5. గుడిబండ, మహబూబ్ నగర్ (గ్రీన్ ఫీల్డ్)

6. భద్రాద్రి కొత్తగూడెం (గ్రీన్ ఫీల్డ్)

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం కేసీఆర్‌ భేటీ
కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం కేసీఆర్‌ భేటీ

 

Leave A Reply

Your email address will not be published.