కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం కేసీఆర్‌ భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు గంటకుపైగా కొనసాగింది. కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు సీఎం కేసీఆర్‌ షెకావత్‌ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించినట్లు సమాచారం. తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు తెలిపినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిత్యం 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతులున్నాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ అమిత్‌ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మూడురోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

 

2 Comments
  1. […] కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం కేసీఆర్… […]

  2. […] కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం కేసీఆర్… […]

Leave A Reply

Your email address will not be published.