కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా

న్యూఢిల్లీ: ఇండియన్ పొజిషన్స్‌కు సమీపంగా పీఎల్ఏ దళాలు ముందుకు వచ్చి గాలిలోకి కాల్పులు జరిపినట్లు ఇవాళ భారత రక్షణశాఖ పేర్కొన్నది. పాన్‌గాంగ్ సరస్సు వద్ద తమ దళాలు ఎల్ఏసీ నియమావళిని ఉల్లంఘించలేదని ఆర్మీ పేర్కొన్నది. దేశీయ, అంతర్జాతీయ ప్రజలను తప్పుదోవ పట్టిచేందుకు చైనా తప్పుడు ప్రకటనలు చేస్తున్నట్లు ఆర్మీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏ దశలోనూ భారతీయ బలగాలు వాస్తవాధీన రేఖను దాటలేదని చెప్పింది. ఎటువంటి కవ్వింపు చర్యలకు కూడా పాల్పడలేదని వెల్లడించింది. పాన్‌గాంగ్ సరస్సు వద్ద దక్షిణం వైపున ఉన్న రెచిన్ లా వద్ద కాల్పులు ఘటన జరిగినట్లు చైనా ఆరోపించింది. చైనా దళాలు అనేక మార్లు దూకుడుగా వ్యవహరించినా తాము మాత్రం ఎటువంటి కవ్వింపుకు పాల్పడలేదని భారతీయ ఆర్మీ వెల్లడించింది. రెచిన్ లా వద్ద సుమారు 7 వేల మంది భారతీయ సైనికులు ఉన్నారు. గత రాత్రి జరిగిన ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్యాంకులను కూడా మోహరించారు. భారత దళాలు కాల్పులు జరిపినట్లు ఇవాళ ఉదయం చైనా వెస్ట్రన్ కమాండర్ తమ మిలిటరీ వెబ్‌సైట్‌లో ప్రకటన చేశారు. తన అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వేదిక కయ్యానికి కాలు దు్వుతోంది. భారత్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ ఆ పత్రిక సంపాదకీయం వెలువరించింది. భారత్‌తో తాము ఏమాత్రం యుద్ధం కోరుకోవడం లేదంటూ. తన పొంతన లేని వైఖరితో ఈ వ్యాఖ్యలు చేసింది. భారత దళాలు హద్దులు మీరుతున్నారంటూ ఆరోపించింది. పైగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొనేందుకు చైనా ప్రయత్నిస్తోందంటూ.. బీరాలు పలికింది. కాగా ఈ ఆరోపణలను భారత రక్షణశాఖ ఖండించింది.