కరోనాతో బెంగాల్‌లో మరో ఎమ్మెల్యే మృతి
కరోనాతో బెంగాల్‌లో మరో ఎమ్మెల్యే మృతి
కోల్‌కతా : ప్రపపంచదేశాలతో పాటు కరోనా భారత్‌ను కూడా కలవర పెడుతోంది. దేశంలో వైరస్తో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతోంది. తాజాగా సోమవారం కరోనా వైరస్‌తో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమరేశ్ దాస్(76) మృతి చెందారు. ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని ఈగ్రా నియోజకవర్గానికి ఎమ్మెల్యే. కొద్ది రోజుల క్రితం దాస్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండె, మూత్రపిండాల సమస్యలు తలెత్తాయి. మొత్తానికి సోమవారం ఉదయం ఎమ్మెల్యే దాస్ మృతి చెందారు. ఎమ్మెల్యే మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దేశంలో మాములు జనాలతో పాటు సెల్రబిటీలు, రాజకీయ నాయకులను కూడా పొట్టనపెట్టుకొంటోంది.
అధికార పార్టీకి చెందిన రెండవ ఎమ్మెల్యే జూన్ నుంచి మరణిస్తున్నారు
అంతకుముందు జూన్ నెలలో తృణమూల్ పార్టీకి మరో శాసనసభ్యుడు మరియు కోశాధికారి తమోనాష్ ఘోష్ (60) కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.