గుర్‌గాన్‌లో కూలిన ఫ్లైఓవ‌ర్‌

చంఢగీర్‌: గుర్‌గాన్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కూలిపోయింది. శనివారం రాత్రి జరిగిన ఈఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. హర్యానాలోని గుర్‌గాన్‌లోన స్లాబ్‌ సోహ్నా ఆర్‌డి ఎలివేటెడ్‌ కారిడార్‌లో నిర్మాణ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అయితే 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ ఒక్కసారిగా కుప్పకూలిందని, ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయ‌ప‌డ్డారు. గుర్‌గాన్‌లోని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలా ట్వీట్‌ చేశారు. భ‌ద్ర‌తా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నట్లు డిప్యూటీ సిఎం పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.