టాప్ టెన్ లో ఏపీ పట్టణాలు

న్యూఢిల్లీ : ‌పారిశుద్ధ్యం, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌కు సంబంధించిన స్వ‌చ్ఛ సర్వేక్ష‌ణ్ 2020 అవార్డుల‌ను కేంద్రం గురువారం కేంద్రం ప్ర‌క‌టించింది. ప‌ది ల‌క్ష‌ల‌కు పైబ‌డిన జ‌నాభాగ‌ల న‌గ‌రాల జాబితాలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ న‌గ‌రం వ‌రుస‌గా నాలుగోసారి ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఇలా వ‌రుస‌గా నాలుగో సారి ఇండోర్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవ‌డం విశేషం. రెండో స్థానంలో గుజరాత్ లోని సూర‌త్‌, మూడో స్థానంలో మ‌హారాష్ట్ర‌లోని ముంబై నిలిచాయి. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌ ‘స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్-2020’జాబితాను ప్ర‌క‌టించింది.
ఇక మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం నగరాలకు చోటు దక్కింది. దేశంలోనే ప‌రిశుభ్ర‌త గ‌ల న‌గ‌రంగా విజ‌య‌వాడ నాలుగో స్థానం ద‌క్కించుకుంది. విశాఖ‌ప‌ట్నం తొమ్మిదో ర్యాంకు సాధించాయి. స్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకులు ప్రకటించే పద్ధతిని 2016 సంవత్సరంలో ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఇందులో భాగంగా… పరిశుభ్రతను పాటించే 129 అత్యుత్తమ నగరాలు, రాష్ట్రాలకు పురస్కారాలనిస్తారు. తొలి సంవత్సరం… దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా మైసూరు నిలిచింది. ఆ తర్వాతి ఏడాది ఇండోర్ నగరం ఈ పురస్కారాన్ని దక్కించుకుంది.

అప్పటి నుంచి ఇండోర్ వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలవడం విశేషం. కాగా… దేశంలో పరిశుభ్రమైన రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఆరో స్థానాన్ని ద‌క్కించుకోగా, తెలంగాణ కూడా టాప్ 10 లో చోటు సంపాదించుకుంది.

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోనే హైద‌రాబాద్‌కు 23వ ర్యాంకుః మేయ‌ర్
హైదరాబాద్ః ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్య నిర్వహణలో హైదరాబాద్‌ నగరానికి మెరుగైన ర్యాంకు సాధ్యమైందని జిహెచ్‌ఎంసి మేయర్‌ బంతు రామ్మోహన్‌ తెలిపారు. గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్‌-2020 ర్యాంకులు ప్రకటించిన సందర్భంగా కేంద్ర మంత్రి న్యూఢిల్లీ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు బిఆర్‌కె భవన్‌ ఎన్‌ఐసి నుండి జిహెచ్‌ఎంసి మేయర్‌ బంతు రామ్మోహన్‌, శానిటేషన్‌ విభాగం అదనపు కమిషనర్‌ రాహుల్‌ రాజ్‌లు పాల్గన్నారు. అనంతరం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జిహెచ్‌ఎంసి స్టాండింగ్‌ కమిటీ మెంబర్‌ స్వప్న, కార్పొరేటర్‌ మమత, శానిటేషన్‌ విభాగం అదనపు కమిషనర్‌ రాహుల్‌రాజ్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 40 లక్షల జనాభా పైబడిన నగరాల్లో జిహెచ్‌ఎంసికి బెస్ట్‌ మెగాసిటీ ఇన్‌ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ అవార్డు లభించినట్లు తెలిపారు. శానిటేషన్‌ నిర్వహణపట్ల ప్రజలనుండి వ్యక్తమైన సానుకూల స్పందనకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 10 లక్షల జనాభా పైబడిన నగరాల్లో జిహెచ్‌ఎంసికి 23వ ర్యాంకు లభించిందని తెలిపారు. దేశంలో 10 లక్షలకు పైబడి జనాభా ఉన్న 47 నగరాల్లో జిహెచ్‌ఎంసికి 23వ ర్యాంక్‌ లభించిందని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్‌లో దేశంలోని 5 ప్రధాన నగరాలతో పోల్చుకుంటే జిహెచ్‌ఎంసి చాలా మెరుగ్గా ఉన్నదని తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి 2015లో 275, 2016లో 19, 2017లో 22, 2018లో 27, 2019లో 35, 2020లో 23వ ర్యాంకులు లభించాయి. 2020లో సౌత్‌ ఢిల్లీకి 31, ముంబయికి 35, నార్త్‌ ఢిల్లీకి 43, బెంగళూర్‌కు 37, చెన్నైకి 45వ ర్యాంకులు లభించాయి. 2016 నుండి 2020 వరకు నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులో జిహెచ్‌ఎంసి మెరుగైన స్కోర్‌ సాధించింది. పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చుటలో కార్పొరేటర్ల సహకారంతో జిహెచ్‌ఎంసి కార్మికులు, అధికారులు, జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు చేస్తున్న కృషిని అభినందించారు. కరోనా పరిస్థితులలో కూడా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చి, విధులు నిర్వహిస్తున్న శానిటేషన్‌ వర్కర్ల కఅషిని ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా ప్రశంసించినట్లు గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.