డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై రేపు సుప్రీంలో తుది తీర్పు

న్యూఢిల్లీ: డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ భ‌వితవ్యం రేపు అంటే అగ‌స్టు 28న తేల‌నుంది. సుప్రీం కోర్టు తీర్పు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌కం కానుంది. కాగా యుజిసి జారీ చేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పును వెల్ల‌డించ‌నుంది. సెప్టెంబర్ 30లోపు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని యూజీసీ దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు ఇప్పటికే స్పష్టం చేసింది. పలు యూనివర్సిటీలు ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించాయి. అయితే.. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు పరీక్షల నిర్వహణకు సుముఖంగా లేవు.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టలేమని కొన్ని రాష్ట్రాలు తేల్చి చెబుతున్నాయి. యూజీ, పీజీ పరీక్షలు మాత్రమే కాదు నీట్, జేఈఈ పరీక్షలను కూడా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా ఈ ప‌రీక్ష‌ల‌పై ప‌లు రాజ‌కీయ పార్టీలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. కాగా తాజాగా ప‌లు వ‌ర్సిటీల‌కు చెందిన విద్యావేత్త‌లు 150 మంది ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని మోడీకి లేఖ‌రాయం తెలిసిందే.. దాంతో కేంద్ర‌మాన‌వ వ‌న‌రుల మంత్రి నీట్, జేఈఈ నిర్వ‌హ‌ణ‌పై రాజ‌కీయాలొద్దు.. ప‌రిక్ష‌లు నిర్వ‌హిస్తాం అని స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై రేపు తీర్పును వెల్లడించనుంది. (ఎన్‌టిఎ మార్గదర్శ‌కాలకు అనుగణంగా పరీక్షలు : కేంద్ర మంత్రి)

Leave A Reply

Your email address will not be published.