తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్‌కే టీకా: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని తిలక్‌నగర్ యూపీహెచ్‌సీలో కరోనా వ్యాక్సినేషన్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సూచన మేరకు ప్రజాప్రతినిధులు ప్రస్తుతం టీకా తీసుకోవడం లేదన్నారు. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు టీకా తీసుకుంటారని మంత్రి అన్నారు. రాష్ర్టంలో 140 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైందని తెలిపారు. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్‌కే టీకా ఇస్తున్నారు. కొవాగ్జిన్ టీకా హైదరాబాద్‌లో తయారు కావడం గర్వకారణంగా ఉందన్నారు. సురక్షితమైన టీకాలను హైదరాబాద్ నగరం ప్రపంచానికి అందిస్తుందని తెలిపారు. ప్రపంచంలో వినియోగించే ప్రతి మూడు వ్యాక్సిన్‌లలో ఒక వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచి ఉత్పత్తి అయిందే ఉంటుందని పేర్కొన్నారు
(దేశంలో టీకా తీసుకున్న తొలి వ్యక్తి మనీశ్ కుమార్ )
మరోవైపు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసి ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మ కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులోకి ఎక్కింది. టీకా ఇచ్చిన అనంతరం ఆమెతో మంత్రి ఈటల రాజేందర్ సంభాషించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెను అబ్జర్వేషన్ గదికి తరలించారు.