దర్శకుడు నిషికాంత్ కామత్ కన్నుమూత
దర్శకుడు నిషికాంత్ కామత్ కన్నుమూత
సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ రోజు (సోమవారం) హిందీ మరియు మరాఠీ చిత్ర పరిశ్రమను మరో వార్త కదిలించింది. దృశ్యం, మాదారీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్న నిషికాంత్ కామత్ సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు.
టాలీవును నుండి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీస్‌లో ఎవరో ఒకరు కన్నుమూస్తున్నారు. గత నెల 31 నుంచి నిషికాంత్ కామత్ ఆరోగ్యం క్షీణిచండంతో ఆయనను హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ రోజు ఆయన చనిపోయాడంటూ ఓ వార్త హల్చల్ చేసింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తాజాగా ఆయన ఈ రోజు సాయంత్రం 4 గంటల 24 నిమిషాలకు కన్నుమూసినట్టు గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
అంతకుముందు ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటన
ప్రకటన సారాంశం.. “మిస్టర్ నిషికాంత్ కామత్ (50 సంవత్సరాలు,)ను జూలై 31 న కామెర్లు మరియు ఉదర వ్యత్యాసాలతో హైదరాబాద్ లోని గచిబౌలిలోని AIG ఆసుపత్రులకు తీసుకువచ్చారు. అతను దీర్ఘకాలిక కాలేయ వ్యాధి మరియు ఇతర అంటువ్యాధులతో బాధపడుతున్నాడు. గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, హెపటాలజిస్ట్, క్రిటికల్ కేర్ మరియు ఇతరులతో కూడిన సీనియర్ కన్సల్టెంట్ల బహుళ-క్రమశిక్షణా బృందం పర్యవేక్షణలో నిరంతర పర్యవేక్షణ కోసం అతను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు. అతని పరిస్థితి క్లిష్టమైనది కాని స్థిరంగా ఉంది. ” అని ప్రకటన విడుదల చేశారు.
కాగా నిషికాంత్ మృతిపై ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా విచారం వ్యక్తం చేశారు.
“కేవలం “దృశ్యం” సినిమాతే మా ఇద్దరి స్నేహాన్ని సరిచూడలేను. ఆయన నన్ను, టబును కలిపి అద్భుతంగా ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. నిషికాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి” అని అజయ్ ట్వీట్ చేశారు.
మరో నటుడు రితేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రితేశ్ ముందగా ఆయన చనిపోలేదు, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్న నిషికాంత్ కన్నుమూయడంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
“నా ప్రియమైన స్నేహితుడిని కోల్పోయా.. నిషికాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి” అని ట్వీట్ చేశారు.